మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ వర్థంతి సందర్భంగా తెదేపా నేతలు ఆయనకు నివాళులర్పించారు. అనంతపురం తెదేపా కార్యాలయంలో పార్టీ శ్రేణులు కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. పేదల వైద్యుడిగా ఉండి.. రాజకీయంలోనే అరుదైన నాయకుడు కోడెల అని గుర్తు చేసుకున్నారు. కోడెల ఆశయాలను కొనసాగించడానికి అందరం కలిసి కృషి చేస్తామని చెప్పారు.
కృష్ణా జిల్లా చందర్లపాడు తెదేపా కార్యాలయంలో శివప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి తెదేపా నేతలు నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు