అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరంపేట వద్ద గురువారం పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మోజీనా(20) అనే యువతి మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరుట్ల తండా గ్రామానికి చెందిన వరుడు శివరంపేటలో తమ సమీప బంధువు అయిన అమ్మాయిని వివాహం చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :