మట్టి, ఎర్రమట్టి సరఫరాపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలంటూ... బుక్కరాయసముద్రం తహసీల్దార్ కార్యాలయం ముందు ట్రాక్టర్ యజమానులు ధర్నాకు దిగారు. ఆంక్షలు విధిస్తే ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్ల కుటుంబాలు ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. అప్పులు చేసి మరీ ట్రాక్టర్లు కొన్నామని... ఇప్పుడు సరఫరాపై ఆంక్షలు విధించటం సరికాదని వాపోయారు.
ఇదీ చదవండి: బ్యాంకులో నగదు స్వాహా... ఆందోళనలో బాధితులు