టమాట పంటను విక్రయించగా వచ్చిన సొమ్మును టమాట వ్యాపారి ఇవ్వటం లేదని ఆరోపిస్తూ... అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీసుస్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కల్యాణదుర్గం పట్టణ శివారులో టమాట మండి నిర్వహించే ఓ వ్యక్తి గత ఆరు నెలలుగా పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వటం లేదని ఆరోపించారు. వ్యాపారి డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నందున తాము కూలీలకు కూలీడబ్బు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.
అతని వద్ద నుంచి సుమారు 11 లక్షల వరకు డబ్బులు రావాలని, వాటిని ఇప్పించాలని కోరుతూ రైతు పురుగుల మందు డబ్బాలతో పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మండి యాజమానిని పిలిపించి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని పోలీసులు హామీనివ్వటంతో రైతులు నిరసన విరమించారు.
ఇదీచదవండి