అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గవ్యాప్తంగా రెండో దశ కరోనా కేసులు ఎక్కువ అవుతుండటం.. గార్లదిన్నెకు చెందిన తిరుపతయ్య తన వంతుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులతో పాటు తాను కరోనా విజృంభనపై అవగాహన కల్పిస్తూ అందరితో ఔరా అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. జనవరి 31న 2020లో ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు. అదే ఏడాది ఫిబ్రవరి 2020 నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందిస్తున్నాడు.
2020 సంవత్సరంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో.. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. గాంధీ మహాత్ముని వేషధారణలో ప్రజలకు వివరించటం అందరినీ ఆకట్టుకుంటుంది. గుత్తిలోని రద్దీ ప్రాంతాలైనా.. గాంధీ కూడలి, ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారుల్లో మాస్క్ ధరిస్తే కరోనా బారిన పడకుండా ఉంటారంటూ.. ఫ్లకార్డు ప్రదర్శిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కరోనా బారిన పడి.. బలి కాకూడదనేదే తన కోరికంటున్నారు. అందుకే ఈ విధంగా ప్రచారం ప్రారంభించినట్లు తిరుపతయ్య పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి...