అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ, ట్రాక్టర్ ఒకదాని వెంట ఒకటి ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..
vishaka steel: 540.8వేల టన్నుల ఉక్కు విక్రయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు