ETV Bharat / state

అపహరణకు గురైన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు - అనంతలో కిడ్నాపైన మూడు నెలల చిన్నారి

అనంతపురం జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్​లో మూడు నెలల పసిపాపను.. తల్లి ఒడిలో నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి కేకలు వేయటంతో.. సమీపంలోని ముళ్లపొదల్లో చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు పాపను తల్లికి అప్పగించారు.

three months baby kidnapped was safe and handovered to mother in ananthapur district
అపహరణకు గురైన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు
author img

By

Published : Jan 6, 2021, 4:01 PM IST

Updated : Jan 6, 2021, 7:19 PM IST

అపహరణకు గురైన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు

అనంతపురం జిల్లా సుబ్బరాయ నగర్​కు చెందిన మాధవి తన మూడు నెలల బాలికను.. ఆసుపత్రికి తీసుకెళ్లి కాలినడకన వస్తుండగా, గుర్తు తెలియని దుండగులు చిన్నారిని అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు.. తల్లి మాధవిపై మత్తుమందు చల్లి పసిపాపను లాక్కెళ్లారు. స్థానికులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో.. రేగాటిపల్లి రహదారి పక్కన ముళ్లపొదల్లో పసిబిడ్డను వదిలివెళ్లారు. చికిత్స నిమిత్తం చిన్నారిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పిల్లలను ఎత్తుకెళ్లేవారు చిన్నారిని అపహరించి వదిలిపెట్టారా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాధవి తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ చేతుల మీదుగా చిన్నారిని తల్లికి అప్పగించారు.

ఇదీ చదవండి:

పోలీసుల అదుపులో మాజీ మంత్రి అఖిలప్రియ.. పరారీలో ఆమె భర్త

Last Updated : Jan 6, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.