అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఒకే కుటుంబంలో ముగ్గురు... రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో అక్కడి ప్రజల్లో కలవరం నెలకొంది. విడపనకల్లు మండలానికి 64 ఏళ్ల వృద్ధురాలు ఈనెల 2న చనిపోయింది. ఆ కుటుంబం బాధలో ఉండగానే... ఈనెల 3న ఆమె మరిది మరణించాడు. ఈ విషాదం నుంచి కుటుంబసభ్యులు తేరుకోకముందే.... వృద్ధురాలి కుమారుడు ఈనెల 10న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిది ఉమ్మడి కుటుంబం.
వీరంతా గత నెలాఖరులో వజ్రకరూరు మండలంలోని సమీప బంధువుల పెళ్లికి హాజరై వచ్చాక... వదిన, మరిది అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యసిబ్బంది పేర్కొన్నారు. వీరి మృతదేహాల నుంచి కరోనా పరీక్షల కోసం ఎలాంటి నమూనాలు సేకరించలేదు. వృద్ధురాలి కుమారుడి మృతదేహం నుంచి నమూనాలు సేకరించగా ఫలితం రావాల్సి ఉంది. ఇదే తరుణంలో.. ఆ కుటుంబ సభ్యుల్లోని ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీ చూడండి..