ETV Bharat / state

అనంతలో రెండు ప్రమాదాలు... ఐదుగురు మృతి...

road accident in ananthapur
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
author img

By

Published : Dec 18, 2020, 8:15 PM IST

Updated : Dec 18, 2020, 9:51 PM IST

20:13 December 18

అనంతలో రెండు ప్రమాదాలు... ఐదుగురు మృతి...

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రాఘవమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు మృతి చెందాారు. ఇంకో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   

బత్తలపల్లి నుంచి రాఘవమ్మపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజశేఖర్ అనే యువకుడిని.. వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. యువకుడి మృతదేహాన్ని చూసేందుకు అదే ప్రాంతంలో ఉన్న శ్రీనివాసులు, శివమ్మపై అనంతపురం నుంచి కదిరి వైపు వెళ్తున్న లారీ దూసుకొచ్చింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వారిని బత్తలపల్లి ఆర్​డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

ఇదీ చదవండి: 

ఓ ప్రేమ కథ... మూడు ప్రాణాలు... ఎన్నో మలుపులు!

Last Updated : Dec 18, 2020, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.