అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో ఆపి ఉన్న ఒక ఆటోలో మూడు రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పసికందు ఏడుపులు విన్న రోగులు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు రోజుల వయసున్న ఆడశిశువును వైద్యురాలు వహీదా, సిబ్బంది చిన్న పిల్లల వార్డుకు తరలించి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. నెలలు నిండని కారణంగానే పసికందు తక్కువ బరువు ఉన్నట్లు వైద్యురాలు తెలిపారు. పుట్టిన వెంటనే శిశువు అనారోగ్యంతో ఉన్నట్లు భావించిన కుటుంబ సభ్యులు పసికందును వదిలించుకోవడానికి ఆటోలో వదిలి ఉంటారని సిబ్బంది భావిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువును పరిశీలించారు. చిన్న పిల్లల వైద్య నిపుణులు పరిశీలించాక పసికందు ఆరోగ్యపరిస్థితిపై ఒక అంచనాకు రావచ్చు అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి పసికందు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
ఇళ్ల స్థలాల పంపిణీ డిసెంబరు 25న.. కోర్టు స్టే లేని చోటల్లా పట్టాలు: సీఎం జగన్