అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలో గత జూన్ నెలలో జరిగిన పలు చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. గుత్తి రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు బాలురు ఘర్షణ పడుతుండగా పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్లే ఆ దొంగతనాలకు కారకులని గుర్తించారు. 12 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చూడండి: పరీక్షల్లో తప్పారు... దొంగలుగా మారారు