కర్ణాటకకు చెందిన దొంగ.... సాదిక్ బాషా ను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ ఇతనికి నేర చరిత్ర ఉన్నట్టు తెలిపారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ప్రాంతానికి చెందిన సాదిక్ బాషా... 2008లో బ్యాంకులో పనిచేస్తూ ఖాతాదారుని నగదును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ కేసులో మంగ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో జైలుకు వెళ్లి వచ్చాడు. కరోనా సమయంలోనూ.. బెంగళూరు సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గాలో దొంగతనానికి పాల్పడినట్లు వివరించారు.
జైలు నుంచి విడుదలైన అనంతరం జిల్లాకు వచ్చి గతేడాది జులైలో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని దర్గాలో రూ.22 వేలు దొంగతనం చేశాడు. ఇతను జిల్లాకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ రాఘవరెడ్డి.. సిబ్బందితో నగరంలోని లిటిల్ ఫ్లవర్ కళాశాల సమీపంలో తనిఖీలు చేశారు. అక్కడే.. నిందితుడిని పట్టుకున్నట్లు సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు. అతని నుంచి ఒక ఇనుప రాడ్డు, రూ.130 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోని రిమాండ్‌కి పంపామన్నారు.
ఇదీ చదవండి: