ETV Bharat / state

గుత్తిలో దొంగల బీభత్సం..తాళం వేసిన ఇళ్లే లక్ష్యం

author img

By

Published : Aug 24, 2020, 8:53 PM IST

ఒక పక్క కరోనా వైరస్​తో జనాలు అల్లాడుతుంటే మరోపక్క దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అందిన మేరకు దోచుకుంటున్నారు. లాక్​డౌన్ వేళ అసలే ఇబ్బందులు పడుతున్న జనాలు.. ఈ దొంగలతో మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పరిధిలో జరుగుతున్న వరుస చోరీలు ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

theives in gutti ananthapuram district
గుత్తిలో దొంగల బీభత్సం

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్​ఎస్ పల్లిలో దొంగలు వరుస ఇళ్లల్లో చోరీలతో బీభత్సం సృష్టించారు. గ్రామంలో నివాసముండే రామచంద్ర అనే రైల్వే ఉద్యోగి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తుండగా దుండగులు ఇంట్లో ప్రవేశించి రూ. 30 వేల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

నాగరాజు అనే ప్రైవేటు వ్యాపారి ఇంట్లో చొరబడి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలతోపాటు ఒకటిన్నర కేజీ వెండి విగ్రహం, రూ.11 వేల నగదు అపహరించారు. మరో 2 ఇళ్లల్లోనూ చోరీలు చేశారు. అయితే ఇంటి యజమానులు లేకపోవటంతో ఎంత దోచుకెళ్లారనేది తెలియలేదని స్థానికులు తెలిపారు.

గుత్తి మండలం బసినేపల్లిలో బహిర్భూమికి వెళ్లిన ఓ వృద్ధురాలు చెవికమ్మలను గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. దీంతో ముసలావిడ కన్నీరుమున్నీరైంది. గుత్తిలో ఈ నెలలోనే రెడీమేడ్ బట్టల షాపులతో పాటు, తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇవీ చదవండి...

హరియాణా దొంగలు.. ఏటీఎంలలో చేస్తారు ఘరానా చోరీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.