ETV Bharat / state

ఆ ఇంట్లో మళ్లీ చోరీ..! ఈసారి కిటికీలను కోసేసి మరీ..! - గుంతకల్లు పట్టణంలో చోరీ

గుంతకల్లు పట్టణంలోని ఓ ఇంట్లో.. ఒకసారి 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మళ్లీ ఇప్పుడు 25 తులాల బంగారం, 2 కేజీల వెండి, 10 వేల నగదు దోచేశారు. ఈసారి కిటికీలను కోసి మరీ దోపిడీ చేశారు. వరుస దొంగతనాలపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవాలని కోరారు.

Theft (robbery) in the house at guntakallu town, ananthapuram district
ఆ ఇంట్లో మళ్లీ చోరీ..! ఈసారి కిటికీలను కోసేసి మరీ..!
author img

By

Published : Dec 12, 2019, 12:32 PM IST

ఆ ఇంట్లో మళ్లీ చోరీ..! ఈసారి కిటికీలను కోసేసి మరీ..!

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మహేంద్ర కల్యాణ మండపం ఎదురుగా నివాసముంటున్న వేముల వెంకటనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఈ నెల 6న వెంకటనారాయణ కుటుంబసభ్యులతో ధర్మవరంలోని తన కూతురి నూతన గృహ ప్రవేశానికి వెళ్లారు. అదునుగా భావించిన దుండగులు తాళం పగలగొట్టకుండా బెడ్​రూంలోని కిటికీ గ్రీల్స్ కోసి లోపలికి చొరబడ్డారు.

లోపలి గదుల తలుపులు లాక్ వేసి ఉండటంతో... వాటిని మిషను సహాయంతో నిలువుగా కత్తిరించి బీరువాలు ఉన్న రూంలోకి ప్రవేశించారు. రెండు బీరువాలు పగలగొట్టారు. 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బుధవారం రాత్రి ఊరి నుంచి తిరిగి వచ్చిన బాధితులు దోపిడీ జరిగినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో విచారిస్తున్నారు. గతంలో ఇదే ఇంట్లో పట్టపగలే 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ కావడం గమనార్హం. రెండోసారి దొంగతనం జరగడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ:

కదిరిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం...

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 12-12-2019 Slug:AP_Atp_21_12_dhopidi_dongalu_bhebastham_Avb_ap10176 anchor:- అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మహేంద్ర కల్యాణ మండపం ఎదురుగా నివాసముంటున్న వేముల వెంకటనారాయణ ఇంటిలో చోరీ జరిగింది. ఈ నెల 6వ తేదీన వెంకట నారాయణ కుటుంబ సభ్యులతో ధర్మవరం లోని అతడి కూతురు నూతన గృహ ప్రవేశానికి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదనుగా దుండగులు ఇంటి తాళం పగులగొట్టకుండా బెడ్ రూం లోకి కిటికీ గ్రీల్ కోసి తొలగించి లోకలికి చొరబడ్డారు. ఐతే లోపల గదుల్లో మరో రెండు గదుల తలుపులు లాక్ వేసి ఉండటం తో ఆ రెండు తలుపులు వాటిని కూడా మనిషి పట్టే విధంగా నిలువుగా కత్తిరించి బీరువాలు ఉన్న గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న రెండు బీరువాలు పగులగొట్టి అందులోని 25 తులాల బంగారు ఆభరణాలను, 2 కిలోల వెండి, రూ.10 వేల నగదును దోచుకెళ్లారు. బుధవారం రాత్రి ఊరి నుండి తిరిగి వచ్చి చూస్తే దోపిడీ జరిగినట్టు గుర్తించామని అన్నారు.వెంటనే రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితుడు వెంకట నారాయణ పిర్యాదు చేశామని తెలిపాడు.కూతురు గృహ ప్రవేశానికి వెళితే..నా ఇంటిని గుల్ల చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.ఐతే గతంలో ఇదే ఇంటిలో పట్ట పగలే అప్పట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ కావడం గమనార్హం. రెండవసారి దొంగతనం కావడంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బైట్స్ : వేముల వెంకట నారాయణ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.