అనంతపురం జిల్లా పాతవూరులోని చెన్నకేశవస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు హుండీలోని డబ్బులు దోచుకెళ్లారు. తెలిసిన వారే పక్కా ప్రణాళికతో చోరీ చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఒక వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఇటీవల నగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయనీ.. భద్రత కరవైందనీ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి..