Theft in bus: కడప జిల్లా పులివెందులకు చెందిన మంజునాథ్, శ్రీలత దంపతులు.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ నుంచి ఆర్టీసీ బస్సులో కొత్తచెరువుకు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో.. వారి వద్దనున్న రూ.10లక్షలు చోరీకి గురయ్యాయి. పులివెందుల అమ్మవారి శాల ఏరియాకు చెందిన మంజునాథ్, శ్రీలత.. ముదిగుబ్బ వరకు కారులో వచ్చారు. అక్కడనుంచి కొత్తచెరువులో ఓ స్థలం కొనుగోలు నిమిత్తం ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారి బ్యాగులో ఉంచిన నగదును దొంగలు అపహరించారు.
కొత్తచెరువులో తమ బంధువుల ఇంటికి చేరుకొన్న దంపతులు మంజునాథ్ శ్రీలత నగదు చూసుకోగా.. బ్యాగులో ఉంచిన 15 లక్షల రూపాయల్లో.. 10 లక్షలు లేకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
అతివల శక్తి అవనికి చాటుతున్నారు.. ఆ రైల్వే స్టేషన్లో అందరూ మహిళా ఉద్యోగులే!