అనంతపురం జిల్లా కదిరిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో నివాసం ఉంటున్న సన్నయ్య కుటుంబం తాళం వేసి పొరుగూరికి పెళ్లికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు.దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటిని పరిశీలించగా..రెండున్నర తులం బంగారం, నగదు అపహరణకు గురైనట్లు ఇంటి యాజమాని తెలిపారు.
ఇదీ చదవండి:తాళం వేసిన ఇంట్లో చోరీ... నిందితుడి అరెస్ట్