అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే కాలనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగి అయిన సౌభాగ్యవతి.. రైల్వే కాలనీలోని వివి నగర్లో నివాసముంటుంది. సౌభాగ్యవతి ఇంట్లోలేని విషయం గమనించిన దొంగలు.. నివాసంలోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 20 తులాల వెండి రూ.45 వేల నగదును అపహరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: