ETV Bharat / state

ఆ బడిలో గోడలు పాఠాలు చెబుతాయి! - అనంతపురం జిల్లా తాజా వార్తలు

ఆ పాఠశాలలో అడుగు పెట్టగానే గోడలపై ఉన్న అక్షరాలు, చిత్రాలు స్వాగతం పలుకుతాయి. బడిలోకి వచ్చిన వారెవరైనా సరే కాసేపు వాటిని చూడకుండా ముందుకు కదలరు. కొన్నాళ్ల క్రితం వరకు మాసిపోయిన గోడలతో బోసిపోయిన ఆ పాఠశాల.. శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడి కృషితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

The walls in that school teaching lessons
The walls in that school teaching lessons
author img

By

Published : Jan 12, 2020, 8:03 AM IST

ఆ బడిలో గోడలు పాఠాలు చెబుతాయి!

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో.... గోడలపై చిత్రాలు విద్యార్థుల్లో ఆలోచనలు రగిలిస్తున్నాయి. 315 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో... ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు స్వతహాగా చిత్రకారుడు. మూడేళ్ల క్రితం బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయనకు... తరగతి గోడలపై పిచ్చి గీతలు కనిపించాయి. వాటి నుంచి విద్యార్థుల దృష్టి మళ్లించడానికి సొంత ఖర్చుతో ప్రతి గోడపై పాఠ్యాంశాలను పొందుపరుస్తూ చిత్రాలు గీశారు. దాదాపు అన్ని సబ్జెక్టుల నుంచి ప్రధానాంశాలను చిత్రించారు. ఖాళీ సమయాల్లో, సెలవు రోజుల్లో ఈ పనిని పూర్తి చేశారు. అంతేకాకుండా విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలిగించే సామెతలు... వివిధ చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి.

పాఠశాల ఆకర్షణీయంగా...

ఉపాధ్యాయుడు శ్రీనివాసులు ఎక్కడ పనిచేసినా పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ నింపుతూనే, బోధన విషయంలో ప్రత్యేకత చాటుతున్నారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులు గీసిన చిత్రాలు... విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా మారాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులను బయట కూర్చోబెట్టి... వాటి ఆధారంగా సాధన చేయిస్తున్నామన్నారు. చిత్రాలు, గుణింతాలు అక్షరమాలలు ఉండటంతో వాటిని విద్యార్థులు సులభంగా నేర్చుకుంటున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:వెలగపూడిలో కలకలం... రైతుల ఇళ్లల్లోకి పోలీసులు!

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఆ గ్రామంలోని పాఠశాల తరగతి గదుల పై ఎక్కడ చూసినా ఎంతో అద్భుతమైన చిత్రాలు కనిపిస్తాయి. వాటిని గీయాలి అంటే ఎంతో నైపుణ్యం అవసరం. అలాంటిది పాఠాలు బోధించే ఒక ఉపాధ్యాయుడు ఆ అద్భుతమైన చిత్రాలను గీసి ఔరా అనిపిస్తున్నాడు. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను రగిలిస్తున్నాయి, బడిలోకి వచ్చినా వారెవరైనా సరే కాసేపు వాటిని చూడకుండా ముందుకు కదలరు. కొన్నాళ్ళ క్రితం వరకూ మాసిపోయిన గోడలతో బోసిపోయిన ఆ పాఠశాల శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు కృషితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక విద్యార్థులైతే ఆ చిత్రాలతోనే సగం విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఆ పాఠశాల ఉరవకొండ మండలం ఆమిద్యాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల.

ఉరవకొండ మండలం ఆమిద్యాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 315 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ అ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు స్వతహాగా చిత్ర కారుడు, మూడేళ్ళక్రితం బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయనకు తరగతి గోడలపై పిచిగితలు కనిపించాయి, వాటి నుంచి విద్యార్థులు దృష్టి మళ్ళించడానికి సొంత ఖర్చులతో ప్రతి గోడపై పాఠ్యాంశాలను పొందుపరుస్తూ చిత్రాలను గీశారు. దాదాపు అన్ని సబ్జెక్టుల నుంచి ప్రధాన అంశాలను చిత్రించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలిగించే సామెతలు వివిధ చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అవన్నీ విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను కలిగిస్తాయి అని ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులు ఎక్కడ పనిచేసిన పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు సామాజిక బోధన విషయంలో ప్రత్యేకత చాటుకుంటారు. ఇలాంటి చిత్రాలను గీయడానికి పాఠశాల ముగిసిన తరువాత ప్రధానంగా సెలవురోజుల్లోనూ ఎంపిక చేసుకుంటా ఉంటారు. సెలవుల్లో ఇంటివద్ద గడపడానికి ప్రయత్నించిన సమయాలు చాలా తక్కువ అని ఆయన అంటుంటారు. తనకు తెలిసిన అంశాలను విద్యార్థులకు తెలియచొప్పలన్న ఆలోచనతో ఈ చిత్రాలు గిసినట్టు ఆయన తెలిపారు. తాను బోధించే పాఠ్యాంశాలతోపాటు ఇలాంటి చిత్రాల వల్ల పిల్లలు సులభంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారానే ఒక ప్రయత్నంగా వివరించాడు. అందుకని విరామ సమయాల్లోనూ సెలవురోజుల్లోనూ వాటిని గీసి విద్యార్థులకు చేరువ చేస్తూ ఉంటాం అని ఉపాధ్యాయుడు తెలిపాడు. పాఠశాల తరగతి గోడలపై పాఠ్యాంశాలతో కూడిన చిత్రాలను ఉపాధ్యాయుడు శ్రీనివాసులు సొంత ఖర్చులతో స్వయంగా గీయడం జరిగిందని ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా మారాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపింది. సాయంత్రం సమయాలలో విద్యార్థులను బయట కూర్చోబెట్టి వాటి ఆధారంగా పిల్లలతో సాధన చేయిస్తామన్నారు. చిత్రాలు గుణింతాలు అక్షరమాలలు ఉండడంతో వాటిని విద్యార్థులకు సులభంగా గుర్తించారన్నారు.

Body:బైట్ 1 : శ్రీనివాసులు, ఉపాద్యాయుడు (చిత్రాలు గీసిన వ్యక్తి)
బైట్ 2 : హంపయ్య, తోటి ఉపాద్యాయుడు.
బైట్ 3 : వర్ష, విద్యార్థిని.
బైట్ 4 : సౌమ్య, విద్యార్థిని.
బైట్ 5 : రాజేష్, విద్యార్థి.
బైట్ 6 : శ్రావణి, విద్యార్థిని.
బైట్ 7 : ఫర్జనా, ఉర్దూ ఉపాధ్యాయురాలు.
బైట్ 8 : యమునమ్మ, ప్రధాన ఉపాధ్యాయురాలు.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 11-01-2020
sluge : ap_atp_71_11_teacher_wall_diagrams_PKG_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.