ETV Bharat / state

HLC Canal: ప్రశ్నార్థకంగా తుంగభద్ర జలాశయం హెచ్ఎల్సీ కాలువ

కరవు సీమ అనంతపురం జిల్లాకు ఎంతో కీలకమైన తుంగభద్ర జలాశయం హైలెవల్ కెనాల్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కల్వర్టులు కూలిపోయి, తూముల గేట్లు కొట్టుకుపోయి కాలువ ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. కాలవ ఆధునికీకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు మండిపడుతున్నారు. టీబీ డ్యాంలో నీరు ఉన్నా.. తెచ్చుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tungabhadra Reservoir High Level Canal
తుంగభద్ర జలాశయం హెచ్ఎల్సీ కాలువ
author img

By

Published : Aug 1, 2021, 7:33 PM IST

ప్రశ్నార్థకంగా తుంగభద్ర జలాశయం హెచ్చెల్సీ కాలువ

అనంతపురం జిల్లాకు తుంగభద్ర డ్యాం ఎగువ కాలవ ఎంతో కీలకమైనది. దాదాపు 72 ఏళ్లుగా తాగు, సాగుకు నీరందిస్తోంది. తుంగభద్ర ప్రధాన కాలువ అనంతపురం జిల్లాలో 84 కిలోమీటర్లు, కర్ణాటకలో 105 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. గతంలో ఈ కాలువ సామర్థ్యం 2,800 క్యూసెక్కులు ఉండగా..ఆధునికీకరణతో 4వేల 200క్యూసెక్కులకు పెరిగింది. కర్ణాటక భూభాగంలో ప్రవహించే కాలువ.. తుంగభద్ర డ్యాం బోర్డు ఆధీనంలో ఉండటంతో వారే ఆధునీకరించారు. కర్ణాటక సరిహద్దు తర్వాత కాలువ మాత్రం శిథిలావస్థకు చేరింది. ఎంతో ఉపయోగకరమైన హెచ్ఎల్సీ కాలువ ఆధునికీకరణ..ప్రభుత్వానికి పట్టడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలువ ఆధునికీకరణకు 12 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 467 కోట్ల రూపాయలు కేటాయించింది. పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించి 310 కోట్ల రూపాయలు గుత్తేదారులకు చెల్లించారు. పనుల నిర్వహణ కష్టమని..దానికి ముగింపు చేస్తూ 2018లో గుత్తేదారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుత్తేదారులకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు కాలువ ఆధునీకరణకు గండిపడేలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా తుంగభద్ర డ్యాంలో నీరు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలువల నుంచి పొలాలకు నీరందించే తూములు కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలువ శిథిలావస్థకు చేరిందని స్థానికులు మండిపడుతున్నారు. అయితే హెచ్ఎల్సీ ఆధునికీకరణ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాంకు గరిష్ఠస్థాయిలో నీరు చేరినా హెచ్చెల్సీ నుంచి జిల్లాకు తెచ్చుకోలేకపోతున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని... రైతులు అంటున్నారు. కాలువ ఆధునికీకరణ చేపట్టి నీరు అందించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Water for Rayalaseema: సీమకు నీటి కోసం పోరాటం.. రఘువీరాతో జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.