ETV Bharat / state

భర్త హత్యకు భార్య కుట్ర...భగ్నం చేసిన పోలీసులు

డబ్బు కోసం భర్తనే హతమార్చాలనుకుంది ఓ భార్య. భర్తను చంపేందుకు ఓ గ్యాంగ్ తో 5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హత్య కుట్రను భగ్నం చేసిన ఘటన అనంతపురం జిల్లా వంగనూరులో జరిగింది.

author img

By

Published : Jul 23, 2019, 8:06 PM IST

భర్తపై హత్య కుట్ర...భగ్నం చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు గ్రామ సమీపంలో హత్యకు కుట్ర పన్నిన ఐదుగురిని పక్కా సమాచారంతో గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో టెక్నికల్ ఆఫీసురుగా విధులు నిర్వహిస్తున్న నిషారుద్దీన్​, అతని భార్య గౌసియా కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు సంవత్సరాల క్రితం విడిపోయి వేరుగా ఉంటున్నారు. భర్తను హత్య చేయిస్తే అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ 14 లక్షలు, ఉద్యోగం తనకే వస్తుందనే దురుద్దేశంతో హత్య చేయాలని పన్నాగం పన్నినట్లు అనంతపురం ఓఎస్డీ ఎంవీయస్ స్వామి తెలిపారు.

5లక్షలకు ఒప్పందం...
అనుకున్నదే తడువుగా తనకు పరిచయం ఉన్న జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవిని గౌసియా సంప్రదించింది. నిర్మలాదేవి తన భర్త కులశేఖర్, స్నేహితుడు గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన రమణారెడ్డి, తాడిపత్రికి చెందిన మురళి కృష్ణా రెడ్డి, నాగేంద్రలు కలిసి 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్వామి వివరించారు. నిందితుల నుంచి 40 వేల నగదు, కొడవలి, పిడిబాకు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి-ఏపీకి రుణ ప్రతిపాదనపై వెనక్కి తగ్గిన ఏఐఐబీ

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_23_delhi_vratalu_annavaram_p_v_raju_av_AP10025_SD. ఈ నెల 27, 28 తేదీల్లో దిల్లీ లో తితిదే ధ్యాన మందిరంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అన్నవరం దేవస్థానం, తితిదే, దిల్లీ లో ఏపీ భవన్ సంయుక్తంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఉదయం రెండు విడతల్లో వ్రతాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు శాంతి కల్యాణం జరగనుంది. 28న ప్రముఖులు, ముఖ్య అధికారులకు మాత్రమే వ్రతాలు నిర్వహించనున్నారు. వ్రతాల నిర్వహణకు అన్నవరం దేవస్థానం నుంచి స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులు, పూజా సామగ్రి తీసుకువెళ్తున్నారు. వ్రత పురోహితులు, అర్చకులు, అధికారులు అన్నవరం నుంచి దిల్లీ వెళ్లనున్నారు.

Conclusion:ఓవర్...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.