లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు పంపడాానికి అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 11 మంది వలస కూలీలను అధికారులు అర్టీసీ బస్సులో అనంతపురం రైల్వే స్టేషన్ కు తరలించారు. కార్మికులతో బయల్దేరిన బస్సును మడకశిర ఎమ్మార్వో ఆనంద్ కుమార్, కమిషనర్ నాగార్జున, సీఐ రాజేంద్రప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇదీ చదవండి: