అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హులికళ్లు గ్రామ సమీపంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఓ గొర్రె మృతి చెందింది. మరో రెండు గొర్రెలు గాయపడ్డాయి. ఈ విషయమై గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమ ప్రాంతం చుట్టూ అడవి ఉన్న కారణంగా.. తరచూ చిరుతల భయం ఉంటోందని వాపోతున్నారు. ఇప్పటికే రెండు నెలల్లో మూడు గొర్రెలు మృతి చెందాయని ఓ రైతు ఆవేదన చెందాడు.
కళ్యాణదుర్గం ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట అడవి జంతువుల బారినపడి పలువురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు చిరుతలు, ఎలుగుబంట్ల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దాడిలో మృతి చెందిన గొర్రెలకు పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: