అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో గొర్రెల కాపరిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో చలపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎం. కొత్తూరు గ్రామానికి చెందిన చలపతి తన గొర్రెల మందను మేత కోసం తోలుకొని వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మోరేపల్లి- కొత్తూరు గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో కాపరి చలపతిపై చిరుత దాడి చేసింది. అతను వెంటనే తేరుకొని గ్రామంలోకి పరుగు తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... క్షతగాత్రుడిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేస్తామని అన్నారు. వన్యప్రాణుల తరుచూ ఈ ప్రాంత పరిధిలో దాడులు చేస్తున్నాయని.... ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
ఇదీ చదవండి