kidnapping case against father : అత్తమామల వద్ద ఉన్న పిల్లలను తీసుకెళ్లినందుకు ఓ తండ్రి, ఆయన బంధువుపై పోలీసులు కిడ్నాప్ కేసు(ఐపీసీ 363) నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారిపై నమోదు చేసిన కేసును కొట్టేసింది. సున్నీ మహ్మదీయ చట్ట ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తుచేస్తూ... పిల్లలపై తల్లి హక్కు అపరిమితమైనది కాదని పేర్కొంది. అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు పిల్లల తండ్రితో పాటు మరొకరిపై నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు.
మహిళ ఫిర్యాదుతో... తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లలను భర్త, మరొకరితో కలిసి కిడ్నాప్ చేశారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుత్తి పోలీసులు 2022 సెప్టెంబర్ 24న కేసు నమోదు చేయగా.. కేసును కొట్టేయాలంటూ పిల్లల తండ్రితో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లపై నమోదు చేసిన కిడ్నాప్ కేసు చెల్లుబాటు కాదన్నారు. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం కుమారుడికి ఏడు, షియా మహ్మదీయ చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే తల్లి సంరక్షణలో ఉంచుకోగలదన్నారు.
తండ్రి చట్టబద్ధ సంరక్షకుడు.. మైనర్లకు తండ్రి సహజ, ప్రాథమిక సంరక్షకుడని సున్నీ మహ్మదీయ చట్టం చెప్తోందన్న కోర్టు.. పిల్లలను తీసుకెళ్లిన సమయంలో ఒకరికి 8, మరొకరికి 10 ఏళ్లున్నాయని తెలిపింది. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మహ్మదీయ చట్ట నిబంధనల ప్రకారం కొంత వయసు వరకే పిల్లలకు తల్లి సంరక్షకురాలిగా ఉంటుందని స్పష్టం చేసింది. నిర్ధిష్టమైన వయసు మించిన పిల్లలకు తండ్రి సహజ, చట్టబద్ధ సంరక్షకుడవుతారని స్పష్టం చేస్తూ.. చట్టబద్ధ సంరక్షకుడు పిల్లల్ని తీసుకెళ్లడం కిడ్నాప్‌గా పరిగణించలేమని పేర్కొంది. కోర్టు తీర్పు మేరకు పోలీసులు కేసును కొట్టేశారు.
ప్రాణాల మీదికి తెచ్చిన జగనన్న కాలనీ... తన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న ఓ వ్యక్తి అధికారుల బెదిరింపుల కారణంగా ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు. బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆర మండల గ్రామంలో చిలుమూరు కన్నయ్య అనే వ్యక్తికి నాలుగు గుంటల స్థలం ఉంది. జగనన్న లే అవుట్ వేసే క్రమంలో రెవెన్యూ అధికారులు కన్నయ్య స్థలాన్ని కూడా ఆక్రమించారు. దీంతో కన్నయ్య... జిల్లా రెవెన్యూ అధికారుల కోర్టును ఆశ్రయించగా ఆయన స్థలాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఈ క్రమంలో కన్నయ్య మూడు రోజుల క్రితం ఇంటి నిర్మాణానికి యత్నించగా.. రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని మనస్తాపంతో పురుగుమందు తాగాడు. ప్రస్తుతం పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి :