అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామ సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలో మృతదేహం బయటపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. ఇంతలోనే బి.పప్పూరు గ్రామస్థుడైన మంజునాథ్....తన తండ్రి నాలుగు రోజుల నుంచి కనపించడంలేదని కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు.
"మీ ఊరికి దగ్గరలో గుర్తు తెలియని మృతదేహం ఉంది" అని పోలీసులు చెప్పడంతో... అతను సంఘటన స్థలానికి చేరుకుని చూడగా....తన తండ్రి నెట్టెం ప్రభాకర్‌గా గుర్తించాడు. 4 రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని...మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని అతని కుమారుడు వెల్లడించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య, కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: