అనంతపురం జిల్లా మడకశిర మండలం బి.రాయపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మేరకు వాగులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలడం.. గ్రామస్తులను కలవరపెట్టింది. సమాచారం తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. ఆరా తీయగా ఆ వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వారుగా నిర్ధరించుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరి మృతిపై బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా చంపి పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: