ETV Bharat / state

MINOR ARREST: బస్టాండ్​లో సెల్​ఫోన్లు చోరీ.. మైనర్ బాలుడి అరెస్ట్

MINOR ARREST
MINOR ARREST
author img

By

Published : Sep 2, 2021, 4:42 PM IST

Updated : Sep 2, 2021, 9:01 PM IST

16:39 September 02

MINOR THIEF ARRESTED BY POLICE

అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్​లో సెల్​ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుత్తి పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రెక్కీ నిర్వహించి వీరిని పట్టుకున్నట్లు ఎస్సైలు సుధాకర్ యాదవ్, మురహరి తెలిపారు. 

బస్టాండ్​లో ఓ మైనర్ బాలుడు సెల్​ఫోన్​ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకొన్నారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారించగా విస్తుబోయే వాస్తవాలు బయటపడ్డాయి. మైనర్​ బాలుడు తెలిపిన వివరాల మేరకు ఉరవకొండకు చెందిన ఆకుతోట రామకృష్ణ అనే వ్యక్తి వద్ద చిల్లరకొట్టులో దొంగతనం చేసిన సెల్​ఫోన్లు దాచినట్లు పోలీసులు తెలుసుకున్నారు.  ఈ కేసులో బాలుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షలు విలువైన 111 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండీ.. C.1.2 virus: కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?

Last Updated : Sep 2, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.