అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం తండాలో రితిక్ నాయక్(2) అనే బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు పొలంలోని నీటి మడుగులో పడి మృతి చెందాడు.
తండాకు చెందిన శీనా నాయక్, అనిత బాయి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే కుటుంబం వారిది. గ్రామానికి చెందిన ఓ రైతు.. వ్యవసాయ తోటను వారు కౌలుకు తీసుకున్నారు. తోటలో పనులు చేస్తుండగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.
రితిక్ నాయక్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి మునిగిపోయాడు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి:
ఆంజనేయ స్వామి రథోత్సవంలో అపశ్రుతి... విద్యుదాఘాతంతో ఒకరి మృతి