ETV Bharat / state

కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత.. మార్కెట్ తొలగింపునకు సిద్ధమైన అధికారులు

Tension at Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఎర్పడింది. స్థానిక కూరగాయల మార్కెట్ తొలగింపునకు అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు సిద్ధమయ్యారు. మార్కెట్​ను తొలగిస్తే ఆత్మహత్యకు పాల్పడతామని పెట్రోల్ బాటిళ్లు చేతిలో పట్టుకొని వ్యాపారులు ఆందోళన చేపట్టారు.

Tension at Kalyandurg
కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత
author img

By

Published : Feb 8, 2022, 1:46 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం సమీపంలోని కూరగాయల మార్కెట్​ను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలీస్​ బలగాలను భారీగా రంగంలోకి దించారు. మరోవైపు.. మార్కెట్​ను తొలగిస్తే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని పెట్రోల్ బాటిళ్లుతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఓ వైపు అధికారులు.. మరొవైపు పెట్రోల్​ బాటిళ్లతో వ్యాుపారులు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మూడు రోజుల క్రితం.. దుకాణాలు ఖాళీ చేయాలని మున్సిపల్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. మేము దుకాణాలు ఖాళీ చేసేదే లేదంటూ దుకాణాదారులు భీష్మమించి కూర్చున్నారు.

ఇదీ చదవండి:

అనంతపురంలో చరిత్ర కలిగిన రెండు సూర్యదేవాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.