అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో.. మట్కా బీటర్లు పోలీసులకు చిక్కారు. పది మంది మట్కా బీటర్లను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రెండు లక్షల 75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కళ్యాణదుర్గం పట్టణ శివార్లలోని అక్కమాంబ దేవాలయ సమీపంలో మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారం వచ్చిందని సీఐ వెల్లడించారు. వెంటనే మెరుపు దాడులు నిర్వహించి.. పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితుల నుంచి 2.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎటువంటి అసాంఘిక కర్యాకలాపాలకు పాల్పడినా.. కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రజలు సమాచారం అందిస్తే.. వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కర్ణాటకకు చెందిన దొంగ.. అనంతపురంలో అరెస్ట్