ETV Bharat / state

బాలికల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రుల ఆందోళన - బాలికల పట్ల తెలుగు టీచర్ అసభ్య ప్రవర్తన

Telugu Teacher Misbehaved with Girls: విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠాలు చెప్పకుండా బాలికలను వెకిలి చేష్టలతో నానా ఇబ్బందులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఆవేశంలో వారు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేయడానికి ప్రయత్నించి, గదిలో నిర్బంధించారు.

Telugu teacher misbehaved
తెలుగు ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన
author img

By

Published : Dec 23, 2022, 4:15 PM IST

Telugu Teacher Misbehaved with Girls: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న వెంకటేశులు.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. గత మూడు ఏళ్లుగా జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వెంకటేశులు తరచూ బాలికలను ఇదే స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన చెందారు.

కొన్నాళ్ళ కిందట ఈ విషయాన్ని గ్రామ సచివాలయ మహిళ కానిస్టేబుల్ ద్వారా ఉరవకొండ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. అతనికి పోలీసు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ ఉపాధ్యాయునిలో ఏలాంటి మార్పు కనిపించకపోగా, బాలికలను వెకిలి చేష్టలతో ఇబ్బందికి గురి చేస్తుండడంతో తల్లిదండ్రులు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకున్నారు.

ఆవేశానికి గురైన బాలికల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని దేహశుద్ధికి ప్రయత్నించి, గదిలో నిర్బందించారు. దీంతో అప్రమత్తమైన ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పాఠశాలకు చేరుకున్న పోలీసులు.. ఉపాధ్యాయుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇలాంటి ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ‌ బాలికలు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలీ చేసుకుంటూ కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నామని, పాఠశాలలో ఇలాంటి ఉపాధ్యాయులు వారిని ఇబ్బందికి గురి చేస్తే, చదువు మాన్ఫించాల్సిన దుస్థితి వస్తుందని వాపోయారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.