ETV Bharat / state

ప్రధానోపాధ్యాయుడు వేధిస్తున్నాడని.. కలెక్టర్​కు ఉపాధ్యాయుడు ఫిర్యాదు

తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు.. తన అంగవైకల్యాన్ని ఎత్తిచూపుతూ పాఠశాలలో విద్యార్థుల ముందు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఓ ఉపాధ్యాయుడు వాపోయారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

teacher
వెంకట నారాయణ
author img

By

Published : Sep 13, 2021, 7:12 PM IST

ప్రధానోపాధ్యాయుడిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రాథమిక పాఠశాలలో వెంకట నారాయణ అనే దివ్యాంగుడు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పని చేస్తున్న మురళీమోహన్ తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ వెంకట నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అంగవైకల్యాన్ని ఎత్తిచూపుతూ విద్యార్థుల ముందు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయాడు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపించారు.

ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ.. పాఠశాలకు రాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడని వెంకటనారాయణ ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తన అంగవైకల్యాన్ని ఎత్తిచూపుతూ దుర్భాషలాడుతూ ఉన్నాడని దివ్యాంగుడు వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ వేధింపులను తట్టుకోలేక స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కు తన సమస్యను తెలియజేశారు. మురళీ మోహన్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల ఘర్షణ..ఏడుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.