ETV Bharat / state

TDP Sympathizers Votes Deletion in Uravakonda: 'బతికుండగానే చంపేశారు'.. అనంతపురంలో బట్టబయలైన వైసీపీ నేత కుట్ర - Votes Deletion in Vidapanakallu at Uravakonda

TDP Sympathizers Votes Deletion in Uravakonda: రాష్ట్రంలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్ల తొలిగింపు ప్రక్రియ సాగుతూనే ఉంది. ఓట్ల తొలగింపుపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీ నాయకుల తీరు మారడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి ఓట్ల తొలగింపునకు చేసిన కుట్ర బయటపడింది.

TDP_Sympathizers_Votes_Deletion
TDP_Sympathizers_Votes_Deletion
author img

By

Published : Aug 18, 2023, 12:13 PM IST

TDP Sympathizers Votes Deletion in Uravakonda: రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీ అధికారులు కుట్రలు పన్నుతున్నారు. ఎలాగైనా గెలుపొందాలనే ఆంక్షతో అడ్డదారులు తొక్కుతున్నారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు.. అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. బతికున్న వారినే చనిపోయారంటూ ఫారం-7ను ఆయుధంగా వాడుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత విశ్వేశ్వరరెడ్డి ఓట్ల తొలగింపునకు చేసిన కుట్ర బయటపడింది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 7వేల ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా ఆయన ధరఖాస్తు చేసినట్లు తెలింది.

YCP trying to remove the votes of TDP supporters టీడీపీ మద్దుతుదారు ఓట్ల తొలగింపుకు కుట్రకు తెరలేపుతున్న వైసీపీ నేతలు

అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఫారం-7ను ఆయుధంగా మలుచుకుని టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పెద్దఎత్తున తొలగిస్తున్నారు. బతికి ఉన్నవారినే చనిపోయారంటూ చిత్రీకరిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేసిన కుట్ర బయటపడింది. చనిపోయిన, పెళ్లిచేసుకుని వెళ్లిపోయిన, ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి ఓట్లు తొలగించాలంటూ ఆయన సుమారు 7వేల ఫారం-7 దరఖాస్తులు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందేందుకు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఓటర్లు మండిపడుతున్నారు.

Bogus Votes in AP : ' 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే'.. విచారణ చేపట్టిన అధికారులు

"బతికున్నవాళ్లనే చనిపోయినట్లు రాస్తే ఎలా.? దీనికి బాధ్యులు ఎవరు? మేము ఎవరికి చెప్పుకోవాలి. బతికుండగానే చంపేశారు. ఓటు వేయాలంటే ఓటు హక్కు లేదంటారు. దీనికి పరిష్కారం ఏమిటి..?"-కుమ్మరి శ్రీనివాసులు, లక్ష్మమ్మ కుమారుడు

Votes Deletion in Vidapanakallu at Uravakonda:విడపనకల్లుకు చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ టీడీపీ సానుభూతిపరురాలు. ఆమె ప్రభుత్వం నుంచి పింఛన్‌ అందుకుంటోంది. ఆమె చనిపోయిందని.. ఆ ఓటు తొలగించాలంటూ ఇటీవలే విశ్వేశ్వర్‌రెడ్డి ఫారం-7 ద్వారా దరఖాస్తు చేశారు. తీరా గడపగడపకు కార్యక్రమంలో ఆమె వద్దకే వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని అందజేసి వైసీపీకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

Payyavula Keshav on Votes Deletion: ఏడు వేల ఓట్లు తొలగించారు.. కలెక్టర్‌కు పయ్యావుల కేశవ్​ ఫిర్యాదు

"మా నాన్న బతికుండగానే చనిపోయినట్లు ఓటర్​ లిస్టులో వచ్చింది. అధికారులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఎటువంటి సర్వే చేయకుండా.. మనుషులు ఉన్నారా లేరా అని చూడకుండా బతికున్న వాళ్లను చనిపోయినట్లుగా రాస్తున్నారు. ఓట్ల కోసం బతికున్నవాళ్లను చంపాల్సిన అవసరం ఏముంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా."-సురేశ్, విడపనకల్లు

Votes Deletion in Uravakonda: విడపనకల్లు మండలంలో 42వేల ఓట్లు ఉండగా.. వీటిలో 15వందల 36ఓట్లు తొలగించాలని విశ్వేశ్వర్‌రెడ్డి ఫారం-7 ద్వారా ధరఖాస్తు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా.. చాలా మంది ఓట్లు సొంత గ్రామంలోనే ఉన్నాయి. వారందరి ఓట్లు తొలగించాలని కోరారు. తాము బతికే ఉన్నామని చనిపోయినట్లు తొలగించిన ఓటర్లు.. అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నా వినేనాథుడే లేకుండా పోయాడు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కావడం వల్లే తొలగిస్తున్నారని.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

Adoni voter list: ఇది విన్నారా..! రెండు ఇళ్లలో 1350 ఓట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.