అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రంలో 'నాఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి' అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్ల పంపిణీ తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో ఒకటిన్నర సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి:
చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది: కాలవ శ్రీనివాసులు