అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెదేపా హయాంలోనే రాయదుర్గం పట్టణంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు.
గత 20 నెలల్లో వైకాపా పాలనలో రాయదుర్గం పట్టణ అభివృద్ధి శూన్యమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ పార్టీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి తెదేపాకే ఓటు వేయాలని కోరారు.
ఇదీ చదవండి: