ETV Bharat / state

టీడీపీ అధికారంలోకి వచ్చాక.. గొర్రెల కాపరులకు సబ్సిడీ రుణాలు: నారా లోకేశ్

TDP National General Secretary Nara Lokesh 'Yuvagalam' Padayatra updates: 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని గొర్రెల కాపరుల సమస్యలను తీర్చేందుకు సబ్సిడీ రుణాలు ఇస్తామని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. 66వ రోజు సోదనపల్లి విడిది కేంద్రం నుంచి 'యువగళం' పాదయాత్రను ప్రారంభించిన ఆయన.. గొర్రెల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు హామీలిచ్చారు.

Yuvagalam
Yuvagalam
author img

By

Published : Apr 10, 2023, 10:46 PM IST

TDP National General Secretary Nara Lokesh' 'Yuvagalam; Padayatra updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 66 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 66వ రోజు పాదయాత్రను లోకేశ్.. అనంతపురం జిల్లాలోని సోదనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన.. యాదవ, గాండ్ల, ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీయ్యారు. అనంతరం సోదనపల్లిలో గొర్రెల కాపరులతో లోకేశ్ మాట్లాడారు. గొర్రెల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకొని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక గొర్రెల కాపరుల సమస్యలను తీర్చేందుకు సబ్సిడీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

గొర్రెల కాపరులకు సబ్సిడీ రుణాలు: అనంతపురం జిల్లాలోని సోదనపల్లిలో ఈరోజు నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో శ్రీను అనే గొర్రెల కాపరితో లోకేశ్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆ గొర్రెల కాపరి (శ్రీను) మాట్లాడుతూ..''నాకు గతంలో 500 గొర్రెలు ఉండేవి. ఈ గవర్నమెంట్ వచ్చాక అకాల వర్షాల వల్ల గొర్రెలకు మేతలేక.. అప్పులు చేసిన బయట్నుంచి మేత తెచ్చుకున్నాము. కానీ, వడ్డీల రేట్లు కట్టలేక గొర్రెలను అమ్ముకున్నాము. ఇప్పుడు నా దగ్గర 100 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్‌లో ప్రతి సంవత్సరం మాకు గొర్రెలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మాకు ఏదైనా సహాయం చేయండి సారూ. '' అని లోకేశ్‌ను కోరారు. వెంటనే స్పందించిన లోకేష్.. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని గొర్రెల కాపరులందరికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

67వ రోజు పాదయాత్ర షెడ్యూల్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర రేపటితో 67వ రోజుకు చేరనుంది. ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్.. రేపు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు ఉదయం ఏడు గంటలకు తాడిపత్రి నియోజకవర్గ సరిహద్దులో ఘన స్వాగతం పలకడానికి జేసీ సోదరుల కుటుంబం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. శింగనమల నియోజకవర్గంలో 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. గత నెల చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి 845 కిలోమీటర్లు పూర్తి చేశారు.

పాదయాత్రలో భాగంగా ఆయన.. రోజూ విడిది కేంద్రంలో ఉదయం కార్యకర్తలు, పార్టీ అభిమానులతో సెల్ఫీలు తీసుకునే కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. ఆ తరువాత పాదయాత్రను ప్రారంభించేవారు. అయితే, రేపటి నుంచి కార్యక్రమంలో స్పల్పమార్పు చేశారు. ఉదయం ఏడు గంటలకే పాదయాత్ర ప్రారంభించి.. 12 గంటల కొనసాగించి, అనంతరం సెల్ఫీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెల్ఫీలు పూర్తయ్యాక భోజన విరామం, సాయంత్రం పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్ర రాత్రి ఏడు గంటల వరకు కొనసాగేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

రేపటి పాదయాత్ర కార్యక్రమాలు:

ఉదయం 7.00–ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.15–పాదయాత్ర తాడిపత్రిలోకి ప్రవేశం.
సింగంగుట్టపల్లిలో స్థానికులతో మాటామంతీ.
7.35–తబ్జుల్లా -1 వద్ద స్థానికులతో భేటీ.
8.25–తబ్జుల్లా -2 వద్ద స్థానికులతో సమావేశం.
10.10–చాగల్లులో మత్స్యకారులతో సమావేశం.
11.00–పెదపప్పూరు శివార్లలో దూదేకులతో ముఖాముఖీ.
12.00–పెదపప్పూరు శివార్లలో భోజన విరామం.
3.00–భోజన విరామ స్థలంలో బుడగజంగాలతో ముఖాముఖీ.
4.00–పెదపప్పూరు శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.25–పెదపప్పూరు సుంకులమ్మ కాలనీలో చేనేతలు, స్థానికులతో సమావేశం.
4.35–పెదపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద రజకులతో సమావేశం.
4.45–పెదపప్పూరు రామకోటి వద్ద బుడుగ జంగాలతో సమావేశం.
4.55–పెదపప్పూరు జడ్పీహెచ్ఎస్ స్కూలు వద్ద విద్యార్థులు, స్థానికులతో భేటీ.
5.05–చినపప్పూరులో స్థానికులతో సమావేశం.
6.10–గార్లదిన్నెలో స్థానికులతో సమావేశం.
7.00–పసలూరులో స్థానికులతో సమావేశం.
7.15–పసలూరు విడిది కేంద్రంలో రాత్రి బస.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.