పీఆర్ మోహన్ మరణం... ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తుదిశ్వాస విడిచేంత వరకు పార్టీలోనే కొనసాగారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. మోహన్ కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీఆర్ మోహన్ మృతికి పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, సీనియర్ నేత వీవీవీ చౌదరి సంతాపం ప్రకటించారు.
గుండెపోటుతో..
శాప్ మాజీ ఛైర్మన్, తెదేపా నేత పీఆర్ మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని నివాసంలో గుండెపోటుతో ఈ ఉదయం ఆయన మృతిచెందారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా 1983లో ఆయన తెదేపాలో చేరారు. న్యాయవాదిగా ఉంటూ తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1984లో పీఆర్‌ను శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఎన్టీఆర్ నియమించారు. 1994, 2014లో రెండు సార్లు శాప్ ఛైర్మన్‌గా పని చేశారు.
ఇదీ చదవండి:
Rayalaseema Lift Irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై 23న ఎన్జీటీ విచారణ