స్థానిక ఎన్నికలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టుగా మారుతాయని తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి అన్నారు. మడకశిరలోని తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మండల తెదేపా శ్రేణులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఇసుక కొరతతో నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేల మంది భవన కార్మికులు పస్తులుంటున్నారని తెలిపారు. రైతులు తమ ఇంటి నిర్మాణం కోసం తమ భూమిలో ఉన్న ఇసుకను తరలిస్తుంటే ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారని తిప్పేస్వామి అన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలన్నా... ప్రజల సమస్యలు తీరాలన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: