ప్రజల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకే ప్రభుత్వం దేవాలయాల నిర్మాణమనే రాగం అందుకుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ప్రజోపయోగ కార్యక్రమాలు, అభివృద్దిలో భాగంగా ఒకచోట ఉన్న ఆలయాలను.. మరోచోటికి మార్చడం కొత్త నిర్మాణమెలా అవుతుందో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఆలయాల నిర్మాణానికి ఎక్కడ స్థలం కేటాయించారో చెప్పకుండా... తూతూమంత్రంగా భూమి పూజలు చేయడాన్ని బట్టే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. ఆలయాలపై దాడులు కొనసాగితే... వివిధ సంఘాలు, పార్టీలతో కలిసి ధర్మ పరిరక్షణ కోసం చంద్రబాబు ఉద్యమిస్తారని కాలవ వెల్లడించారు.
ఇదీ చదవండి
కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలి: చంద్రబాబు