గత 2 నెలలుగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలు కూడా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ తరుణంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం పక్కనున్న హిందూపురం ప్రాంతంలోని రెడ్ జోన్ లో ఉన్న వ్యక్తులను మడకశిరలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మడకశిర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూపురం నుంచి వచ్చిన వ్యక్తులను అక్కడి క్వారంటైన్లో ఉంచరాదని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి: