చేయని తప్పుకు కుటుంబంతో సహా ఆటో డ్రైవర్ బలవన్మరణానికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి 42పై కదిరి పట్టణంలోని ఇందిరాగాంధీ కూడలిలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కొరవడిందన్నారు. నంద్యాలలో పోలీసుల వేధింపులు తాళలేక కుటుంబంతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడటం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని నాయకులు విమర్శించారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: