ETV Bharat / state

'ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేయిస్తున్నారు' - tdp leader umamaheswar naidu

తనపై వస్తున్న ఆరోపణలన్నీ అర్థరహితమైనవని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు కొట్టిపారేశారు. తను సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

tdp leader
తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు
author img

By

Published : Aug 13, 2020, 11:02 PM IST

తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయటంతోనే తనపై ఆరోపణలకు దిగుతున్నారని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. తాను జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటున్నట్లు, రిజర్వాయర్ గర్భంలో కలిసిపోయిన భూమిని సాగు చేసుకుంటున్నట్లు ఇటీవల కొన్ని పత్రికల్లో ఆరోపణలు చేశారన్నారు.

అవన్నీ అర్థరహిత ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. ఇంతవరకు తాను ఒక్క చుక్క నీటిని కూడా వాడుకోలేదనీ.. ప్రస్తుతం తాను సాగు చేస్తున్న ప్రతి ఎకరానికీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై కొన్ని పత్రికల చేత అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

హైకోర్టు స్టేటస్​కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.