రాష్ట్రంలో మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కరోనా పట్ల ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ఆయన పేర్కొన్నారు.
మద్యం దుకాణాలు తెరిచి కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. తక్షణమే మద్యం అమ్మకాలు ఆపేయాలన్నారు.
ఇదీ చూడండి: