అనంతపురం జిల్లా కదిరిలోని నిజాం వలీ కాలనీలో బీడీ కార్మికుల కోసం నిర్మించిన కమ్యూనిటీ భవనం కూల్చివేయటంపై తెదేపా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా అర్బన్ హెల్త్ సెంటర్ పేరిట భవనాన్ని కూల్చివేయటం సరికాదన్నారు. వైకాపా రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చటం తప్పా చేసిందేమీ లేదన్నారు. నవరత్నాల పేరిట ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని విమర్శించారు.
కరోనా నియంత్రణ, బాధితులకు భరోసా ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కదిరి నియోజక వర్గంలో వైకాపా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. అమలు చేయని హామీలతో ప్రజలను వంచించిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు శిలాఫలకాలు, రంగులు వేసుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు.
ఇదీ చదవండి: