ఇసుక దోపిడీపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం రచ్చుమర్రి ఇసుక రీచ్ నుంచి కాలువ శ్రీనివాసులు ప్రజలతో కలిసి పది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రవహించే హగరి నది ఇప్పటికే మృతనదిగా మారినా, వైకాపా నాయకులు మాత్రం ఇసుక తవ్వకాలు ఆపటం లేదని ఆయన మండిపడ్డారు. పచ్చటి పంట పొలాలతో ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టంలేని వైకాపా నాయకులు హగరి నదిలో ఇసుక తవ్వకాలతో ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నారని విమర్శించారు.
ఇసుక తవ్వకాలతో గోతులమయంగా మారిన నదీ గర్భాన్ని చూసి ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని కాలువు శ్రీనివాసులు అన్నారు. వైకాపా నాయకులు ఇసుక దోపిడీతో కోట్ల రూపాయలు సంపాదిస్తుండగా, సామాన్యులు మాత్రం ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనేకల్ మండలం రచ్చుమర్రి ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలపై పోరుబాట పట్టిన కాలువ శ్రీనివాసులుతో ఈటీవీ భారత్తో మాట్లాడారు.
ఇదీ చదవండి : తక్షణమే స్థానిక ఎన్నికలను నిర్వహించండి: ఎంపీ రఘురామ