TDP Leader kalava Srinivasulu Comments On Punganuru Incident: ఇటీవల జరిగిన అంగళ్లు, పుంగనూరు అల్లర్లపై టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. వైసీపీ కుట్రపూరితంగానే ఈ దాడులు చేసిందని ఆరోపించారు. ఈ అల్లర్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురి అధ్యర్యంలోనే జరిగాయని ఆరోపించారు. కానీ, పోలీసులు అసలు వారిని వదిలిపెట్టి.. ఇందులో ఎలాంటి సంబంధం లేని వాళ్లను ఇరికించి కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగళ్లు, పుంగనూరు ఘటనపై ఒక్క వైసీపీ నేతపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలేదంటే దాని అర్థం ఏమిటని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈ అల్లర్లు పెద్దిరెడ్డి, జగన్‌రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డిల పర్యవేక్షణలోనే జరిగాయని ఆరోపించారు. కానీ, పోలీసులు మాత్రం ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేని వాళ్లను.. కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anantapur Excise Police Station Attack: టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టారంటే.. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం గురించి, పోలీసుల గురించి గొప్పలకుపోతున్న వైసీపీ నాయకులకు.. అనంతపురంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జరిగిన దాడి గురించి ఏం చెప్తారని నిలదీశారు. స్టేషన్లోకి చొరబడి మరి వైసీపీ నాయకులు దాడి చేస్తున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో పాలకుల చేతిలో పోలీసులు, అధికారులు బలహీనంగా మారిపోయారని కాల్వ విమర్శించారు.
"ఎస్పీ రిశాంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల.. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాం చంద్రరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, రిశాంత్ రెడ్డి నలుగురు దృష్ట రెడ్ల కుట్ర ఫలితంగా.. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. స్వయంగా చంద్రబాబుపైనే రాళ్ల దాడి చేసింది వైసీపీ గుండా మూక. జగన్మోహన్ రెడ్డి ఇంతకి తెగించడంటే.. పోయేకాలం వచ్చింది. ఈ విధమైన రాజకీయాలు, నీచమైన, కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు." -కాలవ శ్రీనివాసులు, టీడీపీ నేత, మాజీ మంత్రి