ETV Bharat / state

గనులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటి..?: కాలవ - రాయదుర్గంలోని ఖనిజ గనులను ప్రైవేట్​ పరం

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఖనిజాన్ని దోచుకునేందుకే వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖనిజ గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో మంత్రి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Jul 22, 2021, 4:35 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గలోని ఇనుప ఖనిజాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంలో అంతర్యమేంటని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన గనులను టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనంతపురంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన ఖనిజ గనిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే కొంత ప్రభుత్వ సంపదను వైకాపా నాయకులు దోచుకున్నరని.. ఇప్పడు రాయదుర్గంలోని ఖనిజాన్ని సైతం దక్కించుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు పిలిచేలా చేశారని ఆరోపించారు.

ఈ టెండర్ల వెనుక ఆంతర్యమేంటో మంత్రి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇనుప ఖనిజాలను ఉపయోగించుకోవాలని గాని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంపదలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటిపై సీఎం దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

javahar: 'పేదల కన్నీటి ప్రవాహంలో.. వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.