అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ పర్యటనపై అసంబద్ధ వ్యాఖ్యలు మాని.. జిల్లా రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని కళ్యాణదుర్గం తెదేపా సమన్వయకర్త ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగింపు పై పక్క రాష్ట్ర నాయకులు అవహేళనగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని...వైకపా నాయకులు గుర్తెరగాలి తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు కార్యక్రమం మొదలు పెడితే రైతుల సహకారంతో.. తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు. లోకేశ్ పర్యటనపై జిల్లాకు చెందిన మంత్రి అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. విమర్శించడంమాని.. నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : సరిహద్దుల వరకు రండి.. గ్రామాల్లోకి తీసుకెళ్తాం: పేర్ని నాని