కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం పదకొండవ రోజు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు సూచనలతో తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్పీ బాలు.. తెలుగు సంగీత ప్రపంచానికి చేసిన సేవలు, ఆయన గాత్రం చిరస్మరణీయమన్నారు. ఆయన తెలుగువాడు కావడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. ఎస్పీబీ భౌతికంగా లేకపోయినా... తన పాటల రూపంలో మనందరీ మధ్య ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి :